Social Icons

Pages

Tuesday, January 7, 2014

Telugu Rhymes - బుజ్జిపాపాయి నవ్వులు

పైరులు పైరులు పచ్చని పైరులు 
పసిడి ధాన్యాలు ఇచ్చే పైరులు 
ఏరులు ఏరులు గల గల ఏరులు 
రువ్వున పారే జలజల ఏరులు 
మొక్కలు మొక్కలు పచ్చని మొక్కలు 
జల్లులు జల్లులు వర్షపు జల్లులు 
ముదమును గూర్చే హర్శపు జల్లులు 
చదువులు చదువులు పిల్లల చదువులు 
భవితను గూర్చే బంగరు చదువులు 
పువ్వులు పువ్వులు రోజా పువ్వులు 
పాపాయి మొహంలో పండే నవ్వులు 

No comments:

Post a Comment